Paul Washer

యేసు క్రీస్తు యొక్క సువార్త (Telugu)

Paperback

40.00

481 in stock

Buy 10 & get 2 free!!!

Description

పాల్ వాషర్ పాఠకులను యేసును గూర్చిన సువార్త యొక్క వాక్యానుసారమైన పరిశీలన గుండా తీసుకొని వెళుతున్నాడు. బైబిలునుండి లేఖనభాగము వెంబడి లేఖనభాగమును పరిచయము చేస్తూ, వాషర్ దేవుని పరిశుద్ధ గుణమును, మానవ సమస్య అయిన పాపమును, మరియు పశ్చాత్తాపపడి విశ్వసించువారందరి కొరకు యేసు యొక్క విమోచనాత్మకమైన జీవితము, మరణము, మరియు పునరుత్ధానములలో ఉన్న దైవిక పరిష్కారమును గూర్చి వివరిస్తున్నాడు. సువార్త యొక్క ప్రాథమిక సత్యములను తెలుసుకొనుటకు నీవు ఆసక్తితో ఉన్నట్లయితే, లేక క్రీస్తు యొక్క సత్యములను అన్వేషిస్తున్నవారెవరైనా నీకు తెలిసియున్నట్లయితే, నీకు అవసరమైనది ప్రపంచము విన్న అత్యంత గొప్ప వార్త యొక్క ఈ సంక్షిప్త వివరణయే.

సువార్త కంటే సుందరమైనది మరేదీ లేదుయేసుక్రీస్తు ద్వారా దేవుడు పాపులను రక్షిస్తాడనే సువార్త. అబద్ధ సువార్త కంటే హానికరమైనది మరేదీ లేదు. దేవుని వాక్యమును నిరంతరము దృష్టిలో ఉంచుకుంటూపాల్ వాషర్ మనలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూదేవుడు ఎవరుమనము ఎవరిమిమనము ఇప్పుడు మరియు ఎన్నటెన్నటికి దేవునితో ఎలా జీవించగలము అనేవాటిని గూర్చిన సత్యముల విషయములోనికి నడిపిస్తున్నాడు.”
డాక్టర్ జోయెల్ ఆర్. బీక్ప్రెసిడెంట్
ప్యూరిటన్ రిఫార్మ్డ్ థియలాజికల్ సెమినరీ
గ్రాండ్ రాపిడ్స్మిషిగన్

పాల్ వాషర్ పెరూ దేశములో పది సంవత్సరములపాటు మిషనరీగా సేవ చేసాడు. ఈ కాలములో అతను పెరూలో సంఘ స్థాపన చేయుచున్న వారికి సహాయము చేయడము కొరకు హార్ట్ క్రై మిషనరీ సొసైటీని స్థాపించాడు. ప్రస్తుతము పాల్ హార్ట్ క్రై మిషనరీ సొసైటీలోని పరిచారకులలో ఒకనిగా సేవ చేయుచున్నాడుwww.heartcrymissionary.comఅతను మరియు అతని భార్య ఖారో ముగ్గురు పిల్లలను కలిగియున్నారు: ఇయాన్ఎవాన్మరియు రోవాన్.

You may also like…