Description
“శోధన మరియు కలవరం ప్రతి ప్రదేశంలోనూ పొంచి యున్న లోకంలో, మన ఆత్మీయ లక్ష్యాల నుండి మనం పక్కదారి పట్టడం చాలా సులభం. పురుషులముగా, నాయకులుగా, మార్గదర్శకులుగా మరియు విశ్వసనీయతకు మాదిరులుగా ఉండడానికి మనం పిలవబడ్డామని మనకు తెలుసు, అయితే తరచుగా మన స్వీయ అంచనాలకు అనుగుణంగా జీవించడానికి మనం సంఘర్షణ పడుతుంటాము. ఆ కారణంగా ఆత్మీయ క్రమశిక్షణలు ఆవశ్యకం. ప్రార్థన, అధ్యయనం మరియు స్వీయ ఆలోచన వంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా, మనం దేవుని శక్తి, మరియు జ్ఞానంలోనికి ప్రవేశాన్ని పొందగలము, ఆయన సృష్టించిన మనుషులముగా మారతాము.
ఉద్దేశ్యం, యధార్ధత మరియు ప్రభావంతో కూడిన జీవితం కోసం అవసరమైన ఆత్మీయ క్రమశిక్షణలను అభివృద్ధి చేయడంలో పురుషులకు సహాయపడడానికి “దైవిక వ్యక్తి యొక్క క్రమశిక్షణలు (డిసిప్లైన్స్ ఆఫ్ ఎ గాడ్లీ మ్యాన్)”లో, ప్రసిద్ధ కాపరి, రచయిత ఆర్. కెంట్ హ్యూస్ ఒక ఆచరణాత్మక మరియు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శినిని అందిస్తున్నారు. ఆత్మీయత, హాస్యం మరియు బైబిలు అంతర్దృష్టితో, ఏవిధంగా ఉండాలో హ్యూస్ మనకు చూపిస్తున్నారు:
- మన విశ్వాసం కోసం బలమైన పునాదిని నిర్మించడం
- దేవుని వాక్యం గురించిన లోతైన అవగాహనను వృద్ధి చెయ్యడం
- ప్రార్థన మరియు ఆరాధన జీవితాన్ని పెంపొందించుకోవడం
- ఏకాంతం, ఉపవాసం మరియు సౌవార్తీకరణల క్రమశిక్షణలను హత్తుకోవడం
ఆత్మీయ క్రమశిక్షణల పరివర్తన శక్తిని కనుగొనడానికి మరియు మీరు ఉద్దేశించిన దైవభక్తి గల వ్యక్తిగా మారడానికైన ప్రయాణంలో మాతో చేరండి.”
Reviews
There are no reviews yet.